వేసవి వినోదానికి వరంగల్‌లో భారీ ఎగ్జిబిషన్

వేసవి వినోదానికి వరంగల్‌లో భారీ ఎగ్జిబిషన్

వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ తరహా భారీ ఎగ్జిబిషన్‌ను కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆదివారం ప్రారంభించారు.వేసవిలో నగరవాసులకు వినోదం, ఉల్లాసం అందించేలా నయాగరా జలపాతం వంటి ప్రత్యేక ఆకర్షణలతో ఈ ఎగ్జిబిషన్‌ను రూపొందించారు. సాయంత్రం వేళల్లో కుటుంబాలతో గడపడానికి ఇది మంచి వేదికగా ఉంటుందని ఆయన తెలిపారు.