రసెల్ సేవలు మరువలేనివి: షారుఖ్ ఖాన్
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఆండ్రీ రసెల్ చేసిన సేవలు మరువలేనివని ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ 'X' వేదికగా పేర్కొన్నాడు. 'నీ ఒంటిపై KKR జెర్సీ తప్ప, మరే జట్టు జెర్సీ అయినా అంత బాగా కనిపించదు రసెల్. నీ అద్భుతమైన ఆటతీరుతో క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నావు. నీ జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. పవర్ కోచ్‌గా మాతో నీ ప్రయాణం కొనసాగుతుంది' అని పేర్కొన్నాడు.