భారీ వర్షాలు.. రోడ్డు మధ్యలో గుంత

భారీ వర్షాలు.. రోడ్డు మధ్యలో గుంత

జమ్మూలో భారీ వర్షాల కారణంగా రోడ్డు కనెక్టివిటీ తీవ్రంగా ప్రభావితమైంది. కుండపోత వర్షాల కారణంగా తవి నదిలో వరదలు పోటెత్తాయి. దీంతో నాల్గవ తవి వంతెన సమీపంలో ఉన్న ఒక రోడ్డులో కొంత భాగం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలో వాహనాలు చిక్కుకున్నాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, నదులు, వాగుల దగ్గరికి వెళ్లవద్దని హెచ్చరించారు.