మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బీర్ల

BHNG: రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మొగిలి రాజామణికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన వంతు సహాయంగా 50 సంచుల సిమెంట్ బ్యాగులు అందజేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సహాయం చేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈ సహాయాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో మదర్ డైరీ డైరెక్టర్ రామ్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.