నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ
KMR: మద్నూర్‌లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రౌత్వార్ అర్చన శుక్రవారం నామినేషన్ ర్యాలీలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార పాల్గొన్నారు. గ్రామంలో ప్రధాన వీధుల గుండా గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.