'దేవస్థాన భూములు గూగుల్‌కు ఇవ్వడం అన్యాయం'
VSP: సింహాచలం దేవస్థానం భూములను గూగుల్‌కు లీజుకు ఇవ్వడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని వైసీపీ నేత కేకే రాజు విమర్శించారు. దేవాలయ భూములు ధార్మిక అవసరాలకే వినియోగించాలని అన్నారు. రాంబిల్లి ప్రాజెక్ట్ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వమే పునాది వేసిందని, క్రెడిట్ తీసుకోవడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు.