VIDEO: భద్రకాళి అమ్మవారికి పూర్ణాభిషేకం, విశేష పూజలు

VIDEO: భద్రకాళి అమ్మవారికి పూర్ణాభిషేకం, విశేష పూజలు

WGL: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు పూర్ణాభిషేకం నిర్వహించారు. నేడు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేస్తున్నారు.