అనుమానస్పద మృతదేహం లభ్యం

JGL: కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం గురువారం లభ్యమైంది. మృతుడి వయసు సుమారుగా 40 - 50 సంవత్సరాలుగా ఉంటుందని స్థానిక పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ పేర్కొన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.