VIDEO: బ్రహ్మోత్సవాలపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

KDP: జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం అధికారులతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. మునుపెన్నడు లేని విధంగా నారాపుర వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.