ప్రత్యేక రైళ్లు ఇక రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు
VSP: తూర్పు తీర రైల్వే పరిధిలో ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న నాలుగు రైళ్లను వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ రైల్వే అధికారులు శనివారం ఈ ప్రకటనను వెల్లడించారు. దీంతో విశాఖపట్నం-తిరుపతి (సోమ, బుధ), బెంగళూరు (ఆది), చర్లపల్లి (శుక్ర) మధ్య శాశ్వతంగా రైలు సౌకర్యం లభించనుంది.