జిల్లావ్యాప్తంగా పోలీస్ సైకిల్ ర్యాలీలు

జిల్లావ్యాప్తంగా పోలీస్ సైకిల్ ర్యాలీలు

ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మహిళల భద్రత, సాధికారతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా శక్తి టీమ్స్, మహిళా పోలీసులు, యువ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్ల మీదుగా సాగిన ఈ ర్యాలీల్లో మహిళా హెల్ప్‌లైన్ సేవలపై అవగాహన కల్పించారు.