సిరిపురంలో పోషణ మాసోత్సవ కార్యక్రమం

సిరిపురంలో పోషణ మాసోత్సవ కార్యక్రమం

GNTR: మేడికొండూరు (M) సిరిపురం గ్రామంలోని బీఆర్. నగర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ డీ. సునీత ముఖ్య అతిథిగా హాజరై, పిల్లల ఆరోగ్యానికి పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. తల్లులకు బాలామృతం, గుడ్లు, పాలు వంటి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ వేడుకలలో ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.