చాబహార్ పోర్ట్ వద్ద యుద్ధ జ్వాలలు
ఇరాన్‌లోని వ్యూహాత్మక చాబహార్ ఫ్రీట్రేడ్ జోన్ పరిసరాల్లో అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. కొండల్లోని సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరగడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఈ విధ్వంసం జరిగింది. భారత్‌కు ఎంతో కీలకమైన ఈ పోర్ట్ సమీపంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడటం చర్చనీయాంశంగా మారింది.