'హాలియా ఆలయ పూజారిపై చర్యలు తీసుకోవాలి'

'హాలియా ఆలయ పూజారిపై చర్యలు తీసుకోవాలి'

NLG: హాలియా శివాలయం ధర్మకర్త పిట్టల భవాని, ఆలయ పూజారి తనను అవమానించి పసుపు నీళ్లు చల్లి గుడిలోకి రానివ్వలేదని ఆరోపించారు. ఈ ఘటనపై పూజారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా 'ముదిరాజ్ జాతి హలో ముదిరాజ్ చలో'  కార్యక్రమం చేపడుతానని ఆమె హెచ్చరించారు. సృష్టికి మూలమైన స్త్రీ గుడిలోకి వస్తే అపవిత్రం ఎలా అవుతుందని ప్రశ్నించారు.