సబ్జెక్టులపై పట్టు సాధించడానికి పోటీలు
VZM: సబ్జెక్టులపై పట్టు సాధించడానికే క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని విజయనగరం సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎం.అన్నపూర్ణమ్మ అన్నారు. ఆదివారం గజపతినగరం మండలంలోని లోగిస సమీకృత వసతి గృహంలో సబ్జెక్టులపై తరగతుల వారీగా క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.