నిజాంపల్లిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
BHPL: శ్రీరామనవమి సందర్భంగా నేడు గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నిజాంపల్లి గ్రామంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణం మహోత్సవం ఆలయ కమిటీ, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించారు. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.