అంగన్‌వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ

అంగన్‌వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ

సత్యసాయి: కదిరి పట్టణంలో అంగన్‌వాడీ టీచర్లకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బుధవారం నూతన 5G మొబైల్ ఫోన్లను అందజేశారు. పాత ఫోన్లతో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.