VIDEO: ఉచిత కిడ్నీ వైద్య శిబిరం ప్రారంభం
విశాఖలోని గోపాలపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ గణబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వందలాది మంది రోగులకు ఉచిత రక్త పరీక్షలు చేసి, పలు సలహాలు అందించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఇలాంటి శిబిరాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.