'12, 13 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం'
GNTR: ఈ నెల 12, 13 తేదీల్లో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతారయం ఉంటుందని కమీషనర్ శ్రీనివాసులు తెలిపారు. పైపులైన్లకు లీకేజీలకు మరమ్మతులు కారణంగా రేపు ఉదయం 8 గంటల నుంచి సంగం జాగర్లమూడి ప్లాంటు పూర్తిగా నిలిపివేస్తునట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలానే గురువారం సాయంత్రం బాలాజీనగర్ రిజర్వాయర్ల పరిధిలి తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.