పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు

పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు

కృష్ణా: జిల్లాలో గొలుసు దొంగతనాలు పెరుగుతున్నాయి. గన్నవరం, బాపులపాడులలో పట్టపగలు మహిళల గొలుసులు లాక్కొని దొంగలు పారిపోయారు. గ్రాము బంగారం ధర రూ.10 వేలు దాటడంతో మహిళలు కనీసం 2–4 లక్షల నష్టపోతున్నారు. ఈ క్రమంలో స్వీయ అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, బస్సుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.