VIDEO: అంబేద్కర్ విగ్రహానికి కార్మిక జేఏసీ వినతి
KMR: బాన్సువాడలో అర్టిజన్ విద్యుత్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం కోసం అర్టిజన్ విద్యుత్ కార్మికులు సమ్మే చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని దీంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వినతిపత్రం సమర్పించామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.