బాసర ఆలయాన్ని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి

బాసర ఆలయాన్ని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి

NRML: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయాన్ని బుధవారం మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం తరఫున వారిని ఘనంగా సన్మానించారు. వీరి వెంట స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.