గంజాయితో పట్టుబడ్డ వ్యక్తులు అరెస్ట్

గంజాయితో పట్టుబడ్డ వ్యక్తులు అరెస్ట్

విజయనగరం: శృంగవరపుకోట పట్టణ పరిధిలో పందిరప్పన్న జంక్షన్ వద్ద 6 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులు పట్టుబడడంతో అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్.కోట SI తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారని తెలిపారు.