అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన
KDP: బద్వేలులోని ఏవీఆర్ స్కూల్‌లో సోమవారం, విద్యార్థుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక అధికారులు ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వినియోగం, సురక్షితంగా బయటపడటం, గాయపడిన వారిని తరలించడం వంటి అంశాలను వివరించారు.