నేను ఏదైనా చేయగలను: ట్రంప్

నేను ఏదైనా చేయగలను: ట్రంప్

క్యూబాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని తెలిపారు. అది చాలా గొప్ప విషయమని.. తనకు పెద్ద గౌరవం అని అన్నారు. తాను క్యూబాను స్వాధీనం చేసుకోగలనని చెప్పారు. దానితో తాను ఆశించినది ఏదైనా దక్కించుకోగలనని ట్రంప్ వ్యాఖ్యానించారు. క్యూబా వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.