చలి తీవ్రతతో జాగ్రత్త.. జిల్లా ఆరోగ్య శాఖ హెచ్చరిక

చలి తీవ్రతతో జాగ్రత్త.. జిల్లా ఆరోగ్య శాఖ హెచ్చరిక

MHBD: మహబూబాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ సూచించారు. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు సులభంగా సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్న పిల్లలను ఉదయం చల్లటి గాలుల్లో బయటకు తీసుకెళ్లొద్దని, రాత్రి కిటికీలు మూసి వేయాలని ఆయన కోరారు.