కార్యకర్తలతో సమావేశమైన MLA మాధవి
GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి బుధవారం క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీని స్వార్థం కోసం కాకుండా ప్రజాసేవ కోసమే ఎంచుకున్నామని ఆమె అన్నారు. తాను, సిబ్బంది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని మాధవి దిశానిర్దేశం చేశారు.