భారీ వర్షం.. నేలకు ఒరిగిన అరటి తోటలు

భారీ వర్షం.. నేలకు ఒరిగిన అరటి తోటలు

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం అద్దంకివారి లంకలో బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ మేరకు అరటి తోటలు నేలకు ఒరిగాయి. చేతికొచ్చిన పంట నేలకు ఓరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు నష్టపరిహారం అంచనా వేసి వారికి సాయం అందించాలని రైతులు కోరుకుంటున్నారు.