సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 2 వరకు జరగనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సెప్టెంబర్‌ 24న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 28న గరుడ సేవ, అక్టోబర్‌ 2న చక్రస్నానం ఉంటుందని చెప్పారు. భక్తులు బస్సుల్లోనే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు.