ఆశా జనకంగా నువ్వుల పంట

ఆశా జనకంగా నువ్వుల పంట

AKP: కోటవురట్ల మండలంలో రబీ సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న నువ్వుల పంట వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పూత దశలో ఉన్న పంటపై కాయ తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆశిస్తే ప్రొఫైనోఫాస్ 2ml మందు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అధిక దిగుబడి కోసం 2 శాతం యూరియా వేయాలన్నారు.