పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన ప్రమాదం

పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన ప్రమాదం

TG: సికింద్రాబాద్ బేగంపేటలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే రెండో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మాంటలార్పుతున్నారు.