'రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

'రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

కర్నూలు: యూరియా సరఫరా, పంపిణీలో సమస్యలుంటే రైతులు కంట్రోల్ రూం నంబరుకు 8341302863 ఫోన్ చేస్తే వెంటనే చర్యలు చేపడతామని కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రకటన విడుదల చేశారు. గురువారం 906, మరో రెండు రోజుల్లో 2,600 టన్నులు కలిపి మొత్తం 3,506 టన్నుల యూరియా జిల్లాకు రానుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.