ఇసుక డంప్ సీజ్ చేసిన ఎస్సై
MBNR: బాలానగర్ మండలంలోని మాచారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను ఎస్సై లెనిన్, రెవెన్యూ అధికారులతో కలిసి ఇవాళ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన ఇసుకను మండలం కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించనున్నారని తెలిపారు.