'సీఎం ముస్లిం మైనార్టీలను మోసం చేశారు'

ATP: వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలను తీవ్రంగా మోసం చేశారని టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని సప్తగిరి సర్కిల్ కూడలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీల పథకాలు రద్దు చేసి పేద ప్రజల కడుపు కొట్టారని విమర్శించారు.