నీటి గుంతలో పడి వ్యక్తి మృతి
MDK: కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో నీటిపారుదల శాఖలో లస్కర్‌గా పనిచేస్తున్న బోల అంజన్ కుమార్ (40) ప్రమాదవశాత్తు అప్పచెరువు వద్ద లోతైన నీటి గుంతలో పడి మృతి చెందాడు. గ్రామస్తులు గమనించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.