బీజేపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల

బీజేపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ తాజాగా రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఈ విడతలో 111 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. మరో వైపు టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కూడా 291 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తమ జాబితాలో 52 మంది మహిళలు, 95 మంది SCలకు దీదీ అవకాశం కల్పించింది.