మావుళ్ళమ్మ జాతర మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డులోని రామాలయం వద్ద శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 66వ జాతర మహోత్సవాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. వాడవాడలా శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతరలను సంప్రదాయ బద్దంగా నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.