రామప్ప భూముల కౌలుకు వేలం..!
MLG: వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయానికి చెందిన వ్యవసాయ భూముల సాగుకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. గోవిందరావుపేట మండలంలో 485 నుంచి 487 సర్వే నంబర్లో గల వ్యవసాయ భూమికి వేలం పాట ఈ నెల 9న నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల రైతులు రూ.50 వేలు ధరావత్ సొమ్ము చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు.