వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలు
AP: కృష్ణా జిల్లా బందరులో విగ్రహ రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటు కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. వాజ్‌పేయి విగ్రహం పెట్టొద్దంటూ TDP అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో శంకుస్థాపనకు ప్రయత్నించిన బీజేపీ నేతను అడ్డుకుని నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేసింది. ఈ పరిణామంపై BJP నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.