పేదలకు గౌరవప్రద నివాసం కల్పించడమే లక్ష్యం: MLA
BHPL: భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామంలో సుంకరి సంతోష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదలకు గౌరవప్రద నివాసం కల్పించడమే ఇందిరమ్మ పథకం లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.