అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం

అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం

KMR: దేవన్పల్లి పీఎస్ పరిధిలోని రాఘవపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఇవాళ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి కుడి చేతిపై 'వీ.చరన్' అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. మృతదేహం రక్తంతో కనిపించడంతో, ఇది హత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.