నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రహదారి విస్తరణ పనులు, విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని కోరారు.