మొంథా తుపాను నష్టంపై నివేదిక: డీఏవో

మొంథా తుపాను నష్టంపై నివేదిక: డీఏవో

MHBD: మొంథా తుపాను కారణంగా జిల్లాలో దెబ్బతిన్న పంటల ప్రాథమిక నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపించామని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 16,617 ఎకరాల్లో వరి,8,782 ఎకరాల్లో పత్తి,565 ఎకరాల్లో మిర్చి, 65 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయినట్లు నివేదిక రూపొందించామని చెప్పారు.