తీరని గ్యాస్ కష్టాలు.. ఎండలోనూ భారీ క్యూ

తీరని గ్యాస్ కష్టాలు.. ఎండలోనూ భారీ క్యూ

NRPT: ధన్వాడ మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ధన్వాడలోని ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 6 గంటల నుంచే వందలాది సిలిండర్లను క్యూలో ఉంచి, ఎండలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. అధికారులు, నాయకులు స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా గ్యాస్ సరఫరాను త్వరితగతిన కోరుతున్నారు.