పరిక్షా కేంద్రంలో విద్యార్థినిని కాటేసిన పాము

పరిక్షా కేంద్రంలో విద్యార్థినిని కాటేసిన పాము

అన్నమయ్య: పది పరీక్షలు రాస్తున్న విద్యార్థిని పాముకాటుకు గురైన ఘటన మదనపల్లెలో జరిగింది. బసినికొండకు చెందిన అఫ్రన్ నిన్న మదనపల్లెలోని ZPHSలో బయాలజీ పరీక్ష రాస్తుండగా పాము కాలు మీద కాటేసింది. ఈ విషయాన్ని సదరు విద్యార్థిని ఇన్విజిలేటర్‌కు చెప్పగా.. ఏమీకాదని, భయపడకుండా పరీక్ష రాయాలని సూచించినట్లు సమాచారం. అనంతరం బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.