అర్హులైన వారు ఉచిత సైకిళ్లకు అప్లై చేసుకోండి: మంత్రి
ప్రకాశం: రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 25లోపు www.apdascac.ap.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండి 70% అంగవైకల్యం కలిగినవారు అర్హులని తెలియజేశారు.