డ్రైనేజీ లైన్ పనులకు శంకుస్థాపన

డ్రైనేజీ లైన్ పనులకు శంకుస్థాపన

మేడ్చల్: నాచారం డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపనలు చేశారు. రాఘవేంద్ర నగర్, రాజీవ్ నగర్‌లో రూ.52 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.