చింతూరు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి

చింతూరు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి

సత్యసాయి: చింతూరు వద్ద ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడంతో ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందించేందుకు అదనపు వైద్య సిబ్బందిని పంపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.