దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
KNR: వీణవంక మండలంలో పలు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కుంటాల భీమయ్యను జమ్మికుంట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. భీమయ్య తన సహచరుడు నరసయ్యతో కలిసి దేవాలయాల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. గురువారం రెడ్డిపల్లి వద్ద భీమయ్యను పట్టుకోగా, దొంగిలించిన సొమ్ముతో జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నరసయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.