గురుకుల పాఠశాలలో తనిఖీలు
MBNR: జడ్చర్ల మండలంలోని కొత్తతండ, పోచమ్మగడ్డ తండా మైనార్టీ, ఎస్టీ గురుకులాలను జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వంటగది, పారిశుద్ధ్య సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, విద్యాబోధనలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.